Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

కాసినో జూదంలో తెలంగాణా సీఎం సీపీఆర్వో!

జ్వాలా నరసింహారావు…తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్వో). తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనలో గల జ్వాలా నరసింహారావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇందులో విశేషం ఏమిటంటే… అమెరికాలోని ఓ కాసినో క్లబ్ లో ఆయన జూదం ఆడారు. తాను కాసినో గేమ్ అద్భుతంగా ఆడానని, గెల్చానని (Played and won fabulously in Neveda Reno lake Tahoe casino today in USA) తన ఫేస్ బుక్ లో జ్వాలా నరసింహారావు పోస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ సీపీఆర్వో చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన చేసిన ఫేస్ బుక్ పోస్టును దిగువన చూడండి.

Popular Articles