Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

నల్లగొండ జిల్లాలో కలకలం: తుపాకీతో మాజీ మంత్రి హల్ చల్ వీడియో

నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రి ఒకరు తుపాకీ చేబూని చేసిన హడావిడి తీవ్ర కలకలానికి దారి తీసింది. గుత్తా మోహన్ రెడ్డి అనే మాజీ మంత్రి జిల్లాలోని చిట్యాల మండలం ఉరుమడ్లలోని పిల్లాయిపల్లి కాలువ పనులను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. తన భూమి నుంచి కాలువ వెళ్లడానికి వీల్లేదంటూ మోహన్ రెడ్డి తుపాకీతో హల్ చల్ చేసిన వీడియో సంచలనానికి దారి తీసింది.

కాలువ పనులను నిలిపివేయాలంటూ సంబంధిత ఇంజనీర్, జేసీబీ ఆపరేటర్ ను బెదిరించినట్లు సమాచారం. తమకు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోను దిగువన చూసేయండి.

https://www.youtube.com/watch?v=fgv_W_s1c_A

Popular Articles