Top 5 This Week

Related Posts

వీడియో వైరల్: ఈ రైతు ముందు ఇంజనీర్ బలాదూర్!

మనిషి తన తెలివిని ప్రదర్శించడానికి భారీ చదువులే అక్కర్లేదేమో! కాస్త బుర్రున్నోడు దునియా మొత్తం మీద ఎక్కడైనా బతకగలడు. కావాలంటే ఈ రైతును చూడండి. ఏకంగా ట్రాక్టర్ ను ఉపయోగించి గేదె పాలు పిండేస్తున్నాడు. ట్రాక్టర్ ఇంజన్ సాయంతో ఎటువంటి శారీరక శ్రమ లేకుండానే కేవలం రెండు, మూడు నిమిషాల్లో పాలు పిండవచ్చని మహారాష్ట్రకు చెందిన రైతు నిరూపించారు.

పల్లె ప్రాంతాల్లో మా ట్రాక్టర్లను బహు విధాలుగా ఉపయోగిస్తున్నారంటూ మహాంద్రా గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్ర అన్నారు. ఇటువంటి వీడియోలను ప్రజలు తరచుగా తనకు పంపిస్తున్నారని, ఇంజనీర్ కానివారు ఇలా చేయగలరా? అంటూ ఆయా వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ట్రాక్టర్ ఇంజన్ ద్వారా పాలు పితుకుతున్న రైతు వీడియో సోషల్ మీడియలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Popular Articles