Top 5 This Week

Related Posts

కరోనా టాప్ 10 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణా

కరోనా వైరస్ మహమ్మారి తీవ్ర రూపం దాల్చిన పది రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా చోటు దక్కించుకున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించిన టాప్ 10 కరోనా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో, తొమ్మిదో స్థానంలో తెలంగాణా నిలిచాయి. అధికారిక సమాచారం ప్రకారం…3,75,799 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానాన్ని ఆక్రమించగా, ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు (2,13,723), ఢిల్లీ (1,30,606), ఆంధ్రప్రదేశ్‌ (96,298), కర్ణాటక (96,141), ఉత్తర్‌ప్రదేశ్‌ (66,988), పశ్చిమ్‌ బెంగాల్‌ (58,718), గుజరాత్‌ (55,822), తెలంగాణ (54,059), బిహార్‌ (39,176) కొనసాగుతున్నాయి. కాగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా యాభై వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

Popular Articles