Top 5 This Week

Related Posts

చిన్నారి ఓటరు…! నందిత LKG, Age 35 years మాత్రమే!!

హెడ్డింగ్ చూశాక విషయం ఏమిటో దాదాపుగా అర్థమయ్యే ఉంటుంది. ఔను ఇది ప్రభుత్వ అధికారుల లీల.  పెద్దగా ఉపోద్ఘాతం అవసరం లేని విషయం. ఆ చిన్నారి పేరు మెతుకు శ్రీనందిత. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మారుతీనగర్ లో గల ఇంటి నెం. 5-6-434లో నందిత కుటుంబం నివాసం. ఈ చిన్నారి వయస్సు అక్షారాలా మూడేళ్లు. కరీంనగర్ లోని భారతీయ విద్యా కేంద్రంలో శ్రీనందిత ఎల్ కే జీ చదువుతోంది.

ఇదిగో ఈ పసిపాప వయస్సును 35 ఏళ్లుగానమోదు చేసి, శిశువుగా ఉన్నప్పటి ఫొటో ప్రచురించి, ఆమెకు ఓటు హక్కు కూడా కల్పించిన ఉదంతం కరీంనగర్ లో శుక్రవారం బహిర్గతమైంది. ఓటర్ల జాబితాలోఈ చిన్నారి పేరు చూసిన స్థానికులు ఎన్నికల అధికారుల లీలపై ముక్కున వేలేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఇంకా ఇటువంటి చిత్ర, విచిత్ర ఘటనలు ఎన్ని చూడాల్సి వస్తుందో మరి.

Popular Articles