Top 5 This Week

Related Posts

తెలంగాణా హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్

హైదరాబాద్: తెలంగాణా హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ అయింది. తమ వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైనట్లు హైకోర్టు ఐటీ విభాగపు రిజిస్ట్రార్ టి. వెంకటేశ్వరరావు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. హ్యాక్ కు గురైన తెలంగాణా హైకోర్టు వెబ్ సైట్ నుంచి ఆర్డర్ కాపీలను డౌన్ లోడ్ చేస్తుంటే ఆన్ లైన్ బెట్టింగ్ సైట్ కనిపిస్తోంది. పీడీఎప్ ఫైల్స్ కు బదులుగా BDG SLOT అనే సైట్ ఓపెన్ అవుతోంది. ఇదే సారాంశంతో వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైనట్లు అందిన ఫిర్యాదు మేరకు ఈనెల 13వ తేదీనే సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.

ఎఫ్ఐఆర్ లో సైబర్ క్రైం స్టేషన్ పోలీసులు నివేదించిన ఫిర్యాదు సారాంశం

Popular Articles