Top 5 This Week

Related Posts

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో మంత్రి తుమ్మల కీలక భేటీ

హైదరాబాద్: తెలంగాణా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాతో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమావేశమయ్యారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం, విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించడమే లక్ష్యంగా శుక్రవారం సచివాలయంలో మంత్రి తుమ్మల యోగితా రాణాతో భేటీ అయ్యారు.

ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో నూతన భవనాల నిర్మాణం, మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.10.12 కోట్లు మంజూరు చేయాలని ఈ సందర్బంగా మాం్తరి కోరారు. అలాగే కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి రెగ్యులర్ ఉపకులపతిని (వీసీ) త్వరితగతిన నియమించడంతో పాటు, విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాతో మంత్రి తుమ్మల భేటీ చిత్రం

ఇవీ మంత్రి తుమ్మల ప్రతిపాదనలు:
మండలాల వారీగా ఖమ్మం అర్బన్ పరిధిలోని ఎనిమిది, రఘునాథపాలెంలో మరో ఎనిమిది పాఠశాలలు కలిపి మొత్తం 16 బడులను అభివృద్ధి ప్రతిపాదనల్లో చేర్చారు. వీటిలో 2,988 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల మెరుగుదల, విద్యా పరికరాల ఏర్పాటు తదితర పనులకు అంచనాలు రూపొందించారు.

ఖమ్మం అర్బన్ పరిధిలో:
ఎన్‌ఎస్‌సీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పాండురంగాపురం జడ్పీ ఉన్నత పాఠశాల, రాజేంద్రనగర్ ఉన్నత పాఠశాల, జి.ఖమ్మం ఉన్నత పాఠశాల, బాలాజీనగర్ జడ్పీ ఉన్నత పాఠశాల, కుచవల్లి ప్రాథమిక పాఠశాల, బాలాపేట (వైఎస్సార్ కాలనీ) ఎంపీపీఎస్, రాజకవీధి ప్రాథమిక పాఠశాల ఉన్నాయి.

రఘునాథపాలెం మండలంలో:
వి.వెంకటాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల, ఏర్లపూడి, వి.వెంకటాయపాలెం ఎంపీపీఎస్, పువ్వాడనగర్ ఎంపీపీఎస్, పాపటపల్లి, మంచుకొండ, కోయచలక, చిమ్మపూడి పాఠశాలలు ఉన్నాయి.

Popular Articles