Top 5 This Week

Related Posts

పెప్పర్ స్ప్రే చల్లి రూ. 21.00 లక్షల దోపిడీ

హైదరాబాద్: నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ దోపిడీ ఘటన చోటు చేసుకుంది. క్రిప్టో కరెన్సీ కొనుగోలు కోసం వచ్చిన ఓ వ్యక్తిపై పెప్సర్ స్ప్రే చల్లి అతని వద్దగల రూ. 21.00 లక్షల మొత్తాన్ని దోచుకుని పరారయ్యారు దుండగులు.

ఎర్రగడ్డకు చెందిన అమరేంద్ర అనే వ్యక్తి తన వద్ద గల కరెన్సీని డాలర్లుగా మార్చాలని భావించారు. ఈమేరకు తన స్నేహితుల సలహా మేరకు బైనాన్స్ ప్లాట్ ఫామ్ ద్వారా కరెన్సీ మార్పిడికి ప్రయత్నించారు. ఇందులో భాగంగానే కరెన్సీ మార్పిడికోసం బజార్ ఘాట్ కు వచ్చిన అమరేంద్ర లావాదేవీల గురించి చర్చిస్తుండగానే సుమైద్, సయ్యద్ అనే ఇద్దరు వ్యక్తులు అమరేంద్ర కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి అతని వద్ద గల రూ. 21.00 లక్షలతో పరారయ్యారు.

ఈ ఘటనలో అమరేంద్ర వెంట గల విజయ్ కుమార్, విజయేష్ అనే వ్యక్తులపైనా సుమైద్, సయ్యద్ లు దాడిచేసి గాయపర్చారు. బాధితుడు అమరేంద్ర ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Popular Articles