Top 5 This Week

Related Posts

తెలంగాణా మోడల్ స్కూళ్లలో ఎంట్రన్స్ టెస్ట్ తేదీ ఖరారు

ఖమ్మం: 2026-27 విద్యా సంవత్సరానికి తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో ప్రవేశ పరీక్ష జరగనుంది. ఈ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలు, 7 నుండి 10వ తరగతులలో మిగిలిన సీట్ల భర్తీ కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను ఏప్రిల్ 19న నిర్వహించనున్నట్లు ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

6వ తరగతి పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందన్నారు. అదేవిధంగా 7 నుండి 10వ తరగతుల పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. టీజీ మోడల్ స్కూల్ కారేపల్లి, జెడ్పీఎస్ఎస్ కారేపల్లి, టీజీ మోడల్ స్కూల్ టేకులపల్లి కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు.

విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి పుకార్లను నమ్మవద్దని ఆమె ఈ సందర్భంగా సూచించారు. ఇటువంటి పుకార్లు వ్యాప్తి చెందితే వెంటనే జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్, జిల్లా విద్యాశాఖాధికారికి సమాచారం అందించాలన్నారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని తన ప్రకటనలో పేర్కొన్నారు.

Popular Articles