సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో దమ్ మారో దమ్ సీన్ బహిర్గమైంది. చేవెళ్ల శివారల్లోని ఈర్లపల్లి వద్ద గల ఓ రిసార్ట్స్ లో తన పుట్టినరోజు సందర్భంగా మంగ్లీ తన స్నేహితులకు పార్టీ ఇచ్చారు. అయితే ఈ దావత్ లో దామోదర్ అనే వ్యక్తి గంజాయి సేవిస్తూ పోలీసులకు చిక్కాడు. పోలీసులు జరిపిన దాడుల్లో విదేశీ మద్యం కూడా లభ్యమైంది. ఎటువంటి అనుమతి లేకుండా మంగ్లీ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో సింగర్ మంగ్లీపైన, రిసార్ట్స్ ఎండీపైన పోలీసులు కేసు నమోదు చేశారు. మంగ్లీ బర్త్ డే పార్టీలో ఓ ప్రముఖ గేయ రచయితతోపాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.


