Top 5 This Week

Related Posts

‘సాయిగణేష్’ ఉదంతంలో మరో విషాదం

ఖమ్మం నగరానికి చెందిన దివంగత బీజేపీ నేత సాయిగణేష్ ఉదంతంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. సాయిగణేష్ తో నిశ్చితార్థమైన యువతి కొద్దిసేపటి క్రితం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. నిద్రమాత్రలు మింగిన ఈ యువతి పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

బీజేపీ నేత సాయిగణేష్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర వివాదాదస్పమైన సంగతి తెలిసిందే. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పోలీసులు కూడా సాయిగణేష్ ఘటనలో వివాదాస్పద ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సాయిగణేష్ తో నిశ్చితార్థం జరిగిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ఖమ్మం త్రీ టౌన్ లో కలకలానికి దారి తీసింది.

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత సాయిగణేష్ (ఫైల్ ఫొటో)

ఈ యువతితో మరికొద్దిరోజుల్లో వివాహం జరగాల్సిన నేపథ్యంలోనే సాయిగణేస్ ఆత్మహత్య చేసుకున్నారు. సాయిగణేష్ ఆధ్వర్యంలో నిర్మించిన స్తూపం వద్దే ఈ యువతి నిద్రమాత్రలు మింగారు.

Popular Articles