Top 5 This Week

Related Posts

‘మగ్ధూం భవన్ దయా, దాక్షిణ్యాల వల్లే మీకు ఈ స్థాయి’

మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై సీపీఐ అగ్రనేత నారాయణ రియాక్షన్

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనపై చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ నేత నారాయణ తీవ్రంగా స్పందించారు. తనది రాజకీయంగా స్వచ్ఛ చరిత్ర అని, అనైతిక చరిత్రే మీకుంది అని నారాయణ ధ్వజమెత్తారు. ‘మగ్ధూం భవన్ దయా, దాక్షిణ్యాల వల్లనే ఈ స్థాయికి వచ్చారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. వాస్తవాన్ని చెప్పడానికి నేను ప్రయత్నిస్తే, నాపై బురద జల్లాలని ప్రయత్నిస్తే సూర్యునిపై ఉమ్మేసినట్లే తప్ప ఇంకొకటి కాదు’ అని నారాయణ స్పందించారు. మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై సీపీఐ అగ్రనేత నారాయణ ఇంకా ఏమన్నారో దిగువన గల వీడియోలో చూడండి.

Popular Articles