Top 5 This Week

Related Posts

వామ్మో… కరోనా శాడిస్టులు… ఉమ్మి చల్లేస్తున్నారు… సీసీ ఫుటేజ్ కలకలం!

విశ్వాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి వెనుక ఏవేని దుష్టశక్తులు ఉన్నాయా? ఎవరైనా కుట్ర పూరితంగానే అనేక దేశాల్లో వైరస్ వ్యాప్తికి దోహదపడుతున్నారా? చైనా ప్రసారం చేసినట్లు పేర్కొంటున్న సీసీ టీవీ ఫుటేజీలు ఇవే అనుమానాలను కలిగిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో, ఆటోమోబైల్స్, కార్లు, టాక్సీలు, మెట్లు, వాష్ రూమ్స్, లిఫ్ట్ బటన్స్ ఒకటేమిటి? ఇటువంటి అనేక ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ఉమ్మిని ఎలా వ్యాప్తి చేస్తున్నారో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్, కువైట్, ఇటలీ దేశాలకు మాత్రమే ఈ దుశ్చర్య పరిమితం కాలేదని చైనా చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘోర చర్యకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ అంశంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవశ్యకత ఏర్పడిందని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి. ఆయా సీసీ టీవీ ఫుటేజీ వీడియోను దిగువన చూసి కరోనా వైరస్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండండి. ఇటువంటి ఉమ్మి చల్లే శాడిస్టు చర్యలు మన దేశంలో కాకపోవడమే ఒకింత ఊరట. అయినప్పటికీ ప్రభుత్వ సూచన మేరకు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా వ్యవహరించాల్సిన బాధ్యత మనపై ఉంది.

https://www.youtube.com/watch?v=tSWLEQg4hzI

Popular Articles