Top 5 This Week

Related Posts

గ్యాస్ బుకింగ్ కు ఇక ఒకే నెంబర్: మేళ్లచెర్వు

ఇకనుంచి వంట గ్యాస్ బుకింగ్ కోసం ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ దేశ వ్యాప్తంగా ఒకే ఫోన్ నెంబర్ ను కేటాయించినట్లు తెలంగాణా ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు చెప్పారు. రేపటి నుంచి, అంటే నవంబర్ 1వ తేదీ నుంచి ఈ నెంబర్ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ చేసుకునేందుకు ఇప్ప‌టివ‌ర‌కు ప్రాంతాల వారీగా వివిధ ఫోన్ నంబ‌ర్లు ఉండేవ‌న్నారు. అయితే న‌వంబ‌రు 1వ తేదీ నుంచి ఒకే మొబైల్ నెంబ‌ర్ ద్వారా దేశ వ్యాప్తంగా రీఫిల్‌ను బుకింగ్ చేసుకునే అవ‌కాశాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ క‌ల్పించినట్లు చెప్పారు. కొత్తగా ప్రకటించిన 7718955555 అనే ఫోన్ నంబ‌రు ద్వారా 24 గంట‌లు పాటు రీఫిల్‌ను బుకింగ్ చేసుకునే సౌల‌భ్యం వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వచ్చిందన్నారు.

అదేవిధంగా 7588888824 ఫోన్ నంబ‌రుకు వాట్సాప్ ద్వారా కూడా రీఫిల్‌ను బుకింగ్ చేసుకోవ‌చ్చ‌న్నారు. పేటీఎం, అమెజాన్‌, గూగుల్ పే ద్వారా గ్యాస్ బుకింగ్, చెల్లింపులు చేసుకోవ‌చ్చ‌ని చెప్పారు. వీటికి సంబంధించి ఇత‌ర వివ‌రాలు https://cx.indianoil.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని వివ‌రాలు తెలుసుకోవ‌చ్చ‌ని మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు వివరించారు.

Popular Articles