Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

పవార్ కుటుంబానికి ‘బారామతి’ అజేయమైన కంచుకోటగా ఎలా మారింది?

బారామతి నియోజకవర్గం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అజిత్ పవార్ మృతితో మీడియాలో చర్చకు వస్తున్న ప్రాంతం. ఒకప్పుడు బారామతి అంటే కేవలం ఎండిపోయిన భూములు, తీవ్రమైన కరువు, తాగడానికి నీరు కూడా దొరకని అత్యంత వెనుకబడిన ప్రాంతం.

  • ప్రజలు ఉపాధి కోసం ముంబై, పూణే నగరాలకు వలస వెళ్లేవారు. 1967లో శరద్ పవార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, మొట్టమొదట నీటి సమస్యపై దృష్టి సారించారు. కాలువలు తవ్వించి, చెక్ డ్యామ్‌లు నిర్మించి, భూగర్భ జలమట్టాన్ని పెంచడం ద్వారా ఎడారిలాంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు.
  • తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే ఇజ్రాయెల్ దేశపు బిందు సేద్యం (Drip Irrigation) పద్ధతిని పవార్ దేశంలో మొదటిసారి ఇక్కడ ప్రవేశపెట్టి వ్యవసాయ విప్లవం తెచ్చారు. ఇది దేశంలోనే అత్యంత విజయవంతమైన సాగు నమూనాగా నిలిచింది.
  • ‘అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్’ ద్వారా రైతులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడి ‘కృషి విజ్ఞాన కేంద్రం’ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంటూ అంతర్జాతీయ శాస్త్రవేత్తలను సైతం ఆకర్షిస్తోంది.
  • బారామతి దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ నియోజకవర్గాలలో ఒకటిగా నిలిచింది. డిజిటల్ ఇండియా ఊహ కంటే ముందే ఇక్కడి ప్రతి గ్రామం హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో అనుసంధానించబడింది.
  • ఒకప్పుడు వ్యవసాయంపైనే ఆధారపడ్డ ఈ ప్రాంతంలో MIDCని ఏర్పాటు చేసి డైనమిక్స్, ఫెరారో వంటి అంతర్జాతీయ కంపెనీలను తీసుకురావడం ద్వారా వేలమంది యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించారు.
  • కాటన్ టు గార్మెంట్’ (పత్తి నుండి వస్త్రం వరకు) అనే వినూత్న పద్ధతిని అమలు చేసి, పండించిన పత్తిని అక్కడే నూలుగా మార్చి, అంతర్జాతీయ బ్రాండ్లకు అవసరమైన దుస్తులను తయారు చేసే స్థాయికి ఎదిగించారు.
  • విద్యా ప్రతిష్ఠాన్’ వంటి సంస్థల ద్వారా బారామతిని దేశం గర్వించదగ్గ విద్యా కేంద్రంగా మార్చారు. అత్యున్నత ప్రమాణాలు గల కాలేజీలు ఉండటంతో బారామతి నేడు ఒక నాలెడ్జ్ హబ్‌గా పేరుగాంచింది.
  • దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి సహకార బ్యాంకులు అత్యంత లాభాల్లో నడుస్తూ, రైతులకు అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నాయి. దీనివల్ల ఇక్కడ రైతు ఆత్మహత్యలు అనేవి దాదాపు శూన్యం.
  • అజిత్ పవార్ అడ్మినిస్ట్రేటర్ కింద పక్కా ప్లానింగ్‌తో ప్రపంచ స్థాయి రోడ్లు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ మరియు 24/7 విద్యుత్ సరఫరాను నిర్మించారు. బారామతిలోని రోడ్లు యూరప్ దేశాలను తలపిస్తాయి.
  • బారామతి MIDCలో గత 30 ఏళ్లుగా ఒక్కటంటే ఒక్క సమ్మె కూడా జరగలేదు. పారిశ్రామిక శాంతిని కాపాడటం వల్ల బహుళజాతి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడతాయి.
  • ఒక చిన్న తాలూకా స్థాయి పట్టణానికి సొంత విమానాశ్రయం (Baramati Airport) ఉండటం విశేషం. ఇది విఐపిల రాకపోకలకే కాకుండా, ఫ్లయింగ్ స్కూల్స్‌కు కూడా ఒక కేంద్రంగా మారింది.
  • శరద్ పవార్ కుటుంబం తన 50 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఇక్కడ ఓడిపోలేదు. ఆయన వెనుక ఉన్న ఈ బారామతి బలమే పవార్ ని ఢిల్లీ రాజకీయాల్లో “చాణక్యుడిగా” నిలబెట్టింది.
  • బారామతి అభివృద్ధి ఎంత ప్రసిద్ధి చెందిందంటే, రతన్ టాటా, బిల్ గేట్స్ వంటి ప్రముఖులు కూడా ఇక్కడి ప్రగతిని స్వయంగా చూసి ఒక రోల్ మోడల్‌గా ప్రశంసించారు.
  • బారామతిలో అనేక సహకార సంఘాలు, చిన్న తరహా పరిశ్రమలు మహిళల ద్వారానే నడపబడుతున్నాయి.
  • దేశంలోనే మొదటిసారిగా మహిళలకు ఆస్తి హక్కును ప్రయోగాత్మకంగా ఇక్కడ నుండే ప్రోత్సహించారు.
  • ఇక్కడ ఉన్న చెరుకు ఫ్యాక్టరీలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఇక్కడి చక్కెర ఫ్యాక్టరీలు (ఉదా: మలేగావ్, ఛత్రపతి) సహకార (Co-operative) ప్రాతిపదికన నడుస్తాయి. అంటే ఫ్యాక్టరీలో లాభాలన్నీ తిరిగి రైతులకు బోనస్ రూపంలో అందుతాయి. దీనివల్ల రైతులకు దేశంలోనే అత్యధిక గిట్టుబాటు ధర ఇక్కడ లభిస్తోంది.
  • రాజకీయాలకతీతంగా ప్రజలతో నేరుగా అనుబంధం కలిగి ఉండటం, ‘జనతా దర్బార్’ ద్వారా సమస్యలు పరిష్కరించడం బారామతిని పవార్ కుటుంబానికి అజేయమైన కంచుకోటగా మార్చింది.

అభివృద్ధి ఎలా చేయాలో నేర్చుకోవడానికి బారామతి ఒక రోల్ మెడల్ దేశంలో ప్రతి నాయకునికి. ఈ ప్రస్తావన ఎందుకు చెప్తున్నాను అంటే శరద్ పవార్, అజిత్ పవార్ ఆ ప్రాంతానికి చేసిన సేవలను, అభివృద్ధినీ ప్రజలు వారిని గుండెల్లో పెట్టుకున్నారు.. అందుకు వారు చేసిన అభివృద్ధి కారణం. సంపద సృష్టించిన విధానం గొప్పది. అజిత్ పవార్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ..

Popular Articles