Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

జంపన్నవాగులో ‘కుంభమేళా’.. మేడారం తాజా దృశ్యాలు

మేడారం: మేడారం మహాజాతర ప్రాంతం జనమయమైంది. బుధవారం సాయంత్రం సారలమ్మ తల్లి గద్దెనెక్కడానికి ముందే లక్షలాది మందితో మేడారం కిటకిటలాడుతోంది. పుణ్య స్నానాలు ఆచరించడానికి వచ్చిన సమ్మక్క తల్లి భక్తులతో జంపన్న వాగు కుంభమేళాను తలపిస్తూ మహాద్భుత దృశ్యంగా మారింది. మరికొద్ది గంటల్లో సారలమ్మ తల్లి కన్నెపల్లి నుంచి మేడారానికి చేరుకుని తన గద్దెపైకి చేరుకోనుంది. సారలమ్మ గద్దెపై ఆసీనమయ్యే అద్భుత ఘట్టం కోసం లక్షలాది మంది భక్తులు ఊరట్టం క్రాస్ రోడ్ నుంచి మేడారం వరకు వేచి చూస్తున్నారు.

మేడారం మహాజాతరలో బుధవారం నాటి తాజా దృశ్యాలు ఇవీ:

వనదేవతల దర్వననాకి క్యూ లైన్లలో భక్తులు
క్యూ లైన్ల ప్రారంభం వద్ద భక్తజనం
మేడారం వీధుల్లో భక్తజనం
సమ్మక్క తల్లి గద్దె వద్ద దర్శనం చేసుకుంటున్న అశేష భక్తజనం
మేడారం వనదేవతల గద్దెల ప్రాంగణం పరిసరాల్లో భక్తులు
గత అర్ధరాత్రి దేదీప్యమానంగా అమ్మవార్ల గద్దెలు

Popular Articles