Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

భ్రూణ హంతకులపై కలెక్టర్ కు POW వినతి

ఖమ్మం: భ్రూణ హత్యలపై ప్రగతిశీల మహిళా సంఘం (POW) ఖమ్మం జిల్లా కమిటీ పోరాటానికి దిగింది. లింగ నిర్ధారణ చేసే ప్రైవేట్ హాస్పిటల్స్ పై కఠిన చర్యలు తీసుకుని వారి లైసెన్స్ ను శాశ్వతంగా రద్దు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ శిరోమణి డిమాండ్ చేశారు. ఈమేరకు ఈరోజు ప్రగతిశీలా మహిళా సంఘం (POW) బృందం లింగ నిర్ధారణ చేస్తున్న హాస్పిటల్స్ లైసెన్సు పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ కు వినతి పత్రం సమర్పించింది.

ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్. శిరోమణి మాట్లాడుతూ ఖమ్మం పట్టణంలో లింగ నిర్ధారణ చేసి గర్భంలోనే పసి గుడ్డును చిదిమేస్తున్న హాస్పిటల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అయితే ఈ అంశంలో అధికారులు నామమాత్రంగానే తనిఖీ చేసి లైసెన్సులు రద్దు చేసి మళ్లీ వారికి పర్మిషన్లు ఇస్తున్నారన్నారు. భ్రూణ హత్యలకు పాల్పడుతున్నవారు గతంలో నిర్వహించిన ఆసుపత్రుల పేర్లు మార్చి, వాళ్ళ పలుకుబడిని ఉపయోగించి మళ్లీ హాస్పిటల్స్ తెరిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఆడపిల్లల, పసి పిల్లల ప్రాణాలతో సొమ్ము చేసుకుంటున్న హాస్పిటల్స్ ను శాశ్వతంగా మూసివేయాలని, కొందరు అధికారుల రాజకీయ నాయకుల అండదండలతో చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ చేసిభ్రూణ హత్యలకు పాల్పడుతున్న హాస్పిటల్ పై కఠిన చర్యలు తీసుకుని లైసెన్స్ లను శాశ్వతంగా రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఝాన్సీ, జిల్లా సహాయ కార్యదర్శి ప్రతాపనేని శోభ, జిల్లా నాయకులు బందెల లలిత, గోకినపల్లి సరోజిని, ఉమా, లాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Popular Articles