Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

‘వేడుక’లా ఎంపీ వద్దిరాజు బర్త్ డే

రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు ఖమ్మంలో ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన రవిచంద్ర బర్త్ డే వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధు తదతర నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కు చెందిన అనేక మంది నాయకులు రవిచంద్రకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

రవిచంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న కేటీఆర్

అదేవిధంగా ఖమ్మం బుర్హాన్ పురంలోని వద్దిరాజు నివాసంలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన రవిచంద్ర అభిమానులతో బుర్హాన్ పురం ప్రాంతం కిక్కిరిసింది.

ఎంపీ వద్దిరాజుకు శాలువా కల్పి శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఖమ్మంలో వేడుకల అనంతరం ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను కలిసేందుకు ఎర్రవెల్లి ఫాం హౌజ్ కు వెళ్లారు. రవిచంద్ర తన పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ ఆశీస్సులు అందుకున్నారు. ఎంపీ రవిచంద్ర తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ను శుక్రవారం సాయంత్రం కలిసి పుష్పగుచ్ఛమిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎంపీ వద్దిరాజుకు శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు, ఆశీస్సులు అందజేశారు.

Popular Articles