Top 5 This Week

Related Posts

భద్రాద్రి జిల్లాలో కలకలం: తుపాకీతో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తిప్పాపురం అటవీ ప్రాంతంలో గల పోలీస్ బేస్ క్యాంపులో ఓ జవాన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతి చెందిన జవాన్ రూపేష్ నందా (25) 151 బెటాలియన్ కు చెందిన ఉత్తర ప్రదేశ్ వాసిగా సమాచారం. అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు.

రూపేష్ నందా ఆత్మహత్యకు అతని వ్యక్తిగత జీవితమే కారణంగా భావిస్తున్నారు. తీవ్ర నిరాశతో అతను ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. రూపేష్ నందా ఉత్తరప్రదేశ్ లో సివిల్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షను చాలాసార్లు రాశాడని, కాని ఉద్యోగం రాలేదని, అయితే సీఆర్పీఎఫ్ నుండి అతని స్నేహితులు సివిల్ కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అతని తండ్రి ఇటీవల అనారోగ్య కారణంగా మరణించడం, చాలా కాలంగా కుటుంబానికి దూరంగా ఉండడంతో నిరాశకు గురై రూపేష్ నందా ఆత్మహత్య చేసుకున్నాడని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Popular Articles