ఇండియాపై దుస్సాహసానికి దిగిన పాకిస్థాన్ ఉక్కిరి బిక్కిరవుతున్నట్లు ‘ఆపరేషన్ సిందూర్’ అనంతర పరిణామాల వార్తలు స్పష్టం చేస్తున్నాయి. పహల్గాం దాడులతో ‘ఆపరేషన్ సిందూర్’ కు కారణమైన పాకిస్థాన్ తాజా ఘటనలలో భారీ ఎత్తున నష్టపోయినట్లు ఆయా వార్తల సారాంశం. ఆపరేషన్ సిందూర్ తర్వాత క్షిపణులతో భారత్ పై దాడి చేసేందుకు సాహసించిన పాకిస్థాన్ ప్రయత్నాలను మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. భారత్-పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణ పరిణామాల తాజా సమాచారం కుప్తంగా..

- యుద్ధ విమానాలతో భారత్ పై దాడి చేసేందుకు పాకిస్థాన్ విఫలయత్నం చేసింది.
- ముందుగా 15 చోట్ల దాడులకు పాకిస్థాన్ పన్నాగం చేసింది.
- ముందుగానే గుర్తించిన మన ఆర్మీ విజయవంతంగా వాటిని అడ్డుకుంది.
- జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ లపైకి యుద్ధ విమానాలతో దాడికి ప్రయత్నిచింది.
- ఎయిర్ పోర్టులు, ఆర్మీ సెంటర్స్ టార్గెట్ గా ఆత్మాహుతి డ్రోన్లను దాయాది దేశం ప్రయోగించింది.
- పాకిస్థాన్ దుస్సాహస యత్నాలన్నింటీని భారత సైన్యం తిప్పికొట్టింది.
- పాకిస్థాన్ కు చెందిన మూడు ఫైటర్ జెట్లు సహా అన్నింటినీ ఇండియన్ ఆర్మీ తుత్తునియలు చేసింది.
- మనకు ఎటువంటి నష్టం జరగలేదని రక్షణ శాఖ వెల్లడించింది.
- పాకిస్థాన్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడంలో ఇండియన్ ఆర్మీ సఫలమైంది.
- పాకిస్థాన్ దుస్సాహసానికి భారత్ తగిన గుణపాఠం చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
- కరాచీ, ఓమ్రారా పోర్టులపై భారత్ భీకర దాడులకు దిగినట్లు సమాచారం.
- 26 యుద్ధ నౌకలు వెంట రాగా ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగింది.
- బ్రహ్మోస్ క్షిపణులతో పాకిస్థాన్ పై భారత్ మెరుపు దాడులకు దిగినట్లు వార్తలు.
- పది నుంచి పన్నెండు వరకు పాకిస్థాన్ యుద్ధ నౌకలను ధ్వంసం చేసినట్లు వార్తలు.
- మరోవైపు క్వెట్టా నగరం పాకిస్థాన్ చేజారి బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) హస్తగతమైనట్లు వార్తలు వస్తున్నాయి.
- బీఎల్ఏ భీకర దాడులతో పాకిస్థాన్ ఆర్మీ క్వెట్టా నగరాన్ని వీడి పరారవుతున్నట్లు ప్రముఖ మీడియా సంస్థల కథనాలు.
- పాకిస్థాన్ కు చెందిన ఒకరిద్దరు పైలట్లు భారత సైన్యానికి చిక్కినట్లు సమాచారం.
- మరోవైపు లాహోర్ నుంచి కరాచీ వరకు భారత్ కౌంటర్ ఎటాక్ తో పాకిస్థాన్ కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
- మొత్తంగా ఇండియాపై దుస్సాహస చర్యలతో పాకిస్థాన్ ఇంటా, బయటా ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియాకు చెందిన అనేక సంస్థలు నివేదిస్తున్నాయి.

