ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఈమేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై మన రక్షణ దళాలు నిర్వహించిన మెరుపు దాడులను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మరో పహల్గాం ఘటన జరగకుండా పాకిస్థాన్ కు సరైన గుణపాఠం నేర్పారని అన్నారు. ‘పాకిస్థాన్ ఉగ్రవాద మౌళిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలి.. జై హింద్!’ అని అసుద్దీన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఉర్దూ, హిందీ భాషల్లో అసుద్దీన్ చేసిన ట్వీట్ ను దిగువన చూడవచ్చు..
