Top 5 This Week

Related Posts

‘లీగల్’ చిక్కుల్లో అల్లు అర్జున్

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ లీగల్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆర్టీసీ బస్సులను కించపరుస్తూ ఓ వాణిజ్య ప్రకటనలో నటించారనే అభియోగంపై ఆయనకు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. ఈమేరకు అల్లు అర్జున్ కే గాక, ప్రకటనను రూపొందించిన రాపిడో సంస్థకు కూడా లీగల్ నోటీసులు జారీ చేసినట్లు టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జన్నార్ ప్రకటించారు.

అల్లు అర్జున్ నటించిన రాపిడో యాడ్ పై అభ్యంతరాలు వచ్చాయని, ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఆయా ప్రకటన ఉందని సజ్జన్నార్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులను దోసెలతో పోల్చడంపై అభ్యంతరాలు వచ్చాయన్నారు. ఆర్టీసీ సామాన్యులకు సేవలందిస్తోందని, నటులు ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ప్రకటనల్లో నటించాలని ఆయన పేర్కొన్నారు.

Popular Articles