Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

నయా వైరస్… ‘నియో కోవ్’!

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన నియో కోవ్ అనే కొత్త రకం వైరస్ ఇప్పుడు మరోసారి ప్రపంచ ఆందోళనకు కారణమైంది. శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించిన నియో కోవ్ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతోపాటు మరణాల రేటు కూడా అధికంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. నియో వైరస్ గురించి వుహాన్ శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని హెచ్చరించడం గమనార్హం.

దక్షిణాఫ్రికాలోని ఓ ప్రాంతంలో గల గబ్బిలాల్లో నియో కోవ్ వైరస్ బయటపడిందని, ఇది కూడా కరోనా వైరస్ గానే శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకే వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. అయితే ఇందులోని ఓ మ్యుటేషన్ కారణంగా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉన్నట్లు వుహాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

కోవిడ్-19తో బేరీజు వేస్తే నియో కోవ్ అత్యంత ప్రమాకరమైందిగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్లు, యాంటీబాటీలు ఈ వైరస్ నిరోధానికి పనిచేయకపోవచ్చని, ఇది గనుక మనుషులకు సోకితే ప్రతి ముగ్గురిలో ఒకరికి ప్రాణాపాయం తప్పకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. నియో కోవ్ వైరస్ గురించి వుహాన్ శాస్త్రవేత్తల పరిశోధనలకు సంబంధించిన కథనాన్ని రష్యా అధికారిక మీడియా సంస్థ స్పుత్నిక్ తన వార్తా కథనంలో ప్రచురించింది.

Popular Articles