Top 5 This Week

Related Posts

ప్రజల మనస్సును గెల్చుకోవాలి: శ్రీబాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి

ఖమ్మం: ప్రజల మనసు గెలుచుకున్న వారే నిజమైన నాయకులని శ్రీ బాలాజీ ఎస్టేట్ అధినేత వత్సవాయి రవి అన్నారు. ఈనెల 11న జరిగిన తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో పందిళ్ళపల్లి గ్రామ సర్పంచ్ గా శ్రీమతి వత్సవాయి పద్మ జానకిరాములు గెలుపొందారు. ఈ సందర్బంగా విజేతకు వత్సవాయి రవి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన పందిళ్లపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలవడం అభినందనీయమన్నారు. గ్రామ అభివృద్ధికి కట్టుబడి పని చేయాలని రవి సూచించారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి దుశ్శాలువతో సర్పంచ్ పద్మ జానకిరాములును సత్కరించారు.ౌ

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా సీనియర్ నాయకులు వత్సవాయి జానకిరాములు, పందిళ్ళపల్లి సీపీఎం శాఖ కార్యదర్శి లింగం కోటేశ్వరరావు, నాయకులు కొల్లి నారాయణ, బండ్ల రామయ్య, అలవాల అంజయ్య, ఏసు వెంకటేశ్వర్లు, మండే రవి, ఏసు బాబు, అలవాల నారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా ఇదే సందర్భంగా తమను అభినందించిన శ్రీ బాలాజీ ఎస్టేట్ అధినేత వత్సవాయి రవిని కూడా పందిళ్ళపల్లి సర్పంచ్ దంపతులు ఘనంగా సన్మానించారు.

Popular Articles