Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

FASTag.. శుభవార్త

నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం శుభవార్తను అందించింది. ఇందుకు సంబంధించి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. FASTag అంశంలో ఏడాదిపాటు అమలులో ఉండే సరికొత్త పాస్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. మూడు వేల రూపాయలను చెల్లించి ఈ పాస్ ను తీసుకోవచ్చని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితన్ గడ్కరీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పాస్ తీసుకున్న వాహనదారులు సంవత్సరం పొడవునా లేదా 200 ట్రిప్పుల వరకు (ఏది ముందయితే అది) జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చన్నారు. కార్లు,జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేత వాహనాలకు ఇది వర్తిస్తుందని చెప్పారు.

దేశంలోని అన్ని జాతీయ రహదారులపై ఈ సరికొత్త FASTag పాస్ చెల్లుతుందని పేర్కొన్నారు. వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ వార్షిక FASTag పాస్ ను అమలులోకి తీసుకువస్తామన్నారు. దీని యాక్టివేషన్ కోసం త్వరలోనే ఓ లింక్ ను అందుబాటులోకి తెస్తామని, రాజ్ మార్గ్ యాప్ తోపాటు NAHI, MoRTH వెబ్ సైట్లలో ఈ లింక్ అందుబాటులోకి వస్తుందని నితిన్ గడ్కరీ వివరించారు.

Popular Articles