Top 5 This Week

Related Posts

ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు ప్రజాప్రతినిధుల హత్య

పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను మావోయిస్టు పార్టీ నక్సల్స్ హత్య చేశారు. పొరుగున గల ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో నక్సల్స్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

బర్డెలా గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ ధనే రామ్ కోర్సాను, గొంగ్లా గ్రామానికి చెందిన వార్డ్ పంచ్ గోపాల్ కుడియంను నక్సలైట్లు పదునైన ఆయుధాలతో హత్య చేశారు. పోలీస్ ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై మావోయిస్టులు ఈ సంఘటనకు పాల్పడినట్లు బీజీపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ చెప్పారు.

Popular Articles