Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

మానుకోటలో ముగ్గురు మంత్రుల పర్యటన

మహబూబాబాద్‌ జిల్లాలో మంగళవారం ముగ్గురు మంత్రులు పర్యటించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్, దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖలు మానుకోటలో పర్యటించి రూ. 186.00 కోట్లతో నిర్మించిన మెడికల్, నర్సింగ్ కాలేజీలకు, 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్, బాలుర-బాలికల హాస్టల్ కు ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ, పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతోందని చెప్పారు. జిల్లాకు ఇప్పటికే 18 టన్నుల యూరియా చేరిందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత కోటా సాధించేందుకు మంత్రివర్గం త్వరలో ఢిల్లీకి వెళ్లనుందని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ బలోపేతానికి పదోన్నతులు కల్పించి, అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

కార్యక్రమంలోముఖ్యమంత్రి సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ ఝాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళినాయక్, పార్లమెంట్ సభ్యుడు పోరీక బలరాం నాయక్, ఎమ్మెల్సీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Popular Articles