Top 5 This Week

Related Posts

కరోనాలో ఉధృతిలోనూ మంత్రి కేటీఆర్ సాహస పర్యటన

కరోనా ఉధృతిలోనూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం కరీంనగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ ప్రారంభోత్సవం, అర్బన్ మిషన్ భగీరథ పథకం, హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటడం తదితర అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో సోమవారం 87 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో అధికశాతం జిల్లా కేంద్రంలోనే ఉన్నట్లు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లోనూ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సాహసంగా పాల్గొనడం విశేషంగా పార్టీ కార్యకర్తలు అభివర్ణిస్తున్నారు.

మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించిన చిత్రమాలికను దిగువన చూడవచ్చు.

Popular Articles