తెలంగాణా పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు బోధన తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్రంలోని బడుల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. సీబీఎస్ ఈ, ఐసీఎస్ ఈ, ఐబీ సహా ఇతర బోర్డు స్కూళ్లలో తెలుగు సబ్జెక్టు బోధనను అమలు చేయాలని సర్కారు ఆదేశించింది. తొమ్మిదో తరగతి విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరం నుంచే తెలుగు సబ్జెక్టు బోధన అమలు జరిగేలా చూడాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది.