Top 5 This Week

Related Posts

సాదా బైనామాలపై సర్కార్ నోటిఫికేషన్ జారీ

సాదా బైనామాల రెగ్యులరైజేషన్ కోసం తెలంగాణా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తెల్లకాగితాలపై రాసుకున్న భూ కొనుగోళ్ల ఒప్పందాలకు మోక్షం లభించనుంది. ఇందుకు సంబంధించి 2020 అక్టోబర్ 12వ తేదీ నుంచి అదే సంవత్సరం నవంబర్ 10వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను క్రమబద్ధీకరించనునున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. భూభారతి చట్టంలోని సెక్షన్ 6లోని సబ్ క్లాజ్ 1 కింద సాదా బైనామాలను రెగ్యులరైజేషన్ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

అయితే 2024 జూన్ 2వ తేదీకి ముందు భూమి తమ సాగులోనే ఉన్నట్లు సాదా బైనామా కాగితం, పట్టాదార్ పాస్ బుక్ ఆధారంగా దరఖాస్తు చేసుకున్నవారు మాత్రమే ఇందుకు అర్హులు. అంతేకాదు కనీసం పన్నెండేళ్లకు పైగా భూమి తమ ఆధీనంలో గలవారి దరఖాస్తులను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు. సాదా బైనామాల పరిష్కారం కోసం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9.80 లక్షల దరఖాస్తులు క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రతిని దిగువన చూడవచ్చు

Popular Articles