Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు లాటరీ తేదీలు ఖరారు

రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను లాటరీ పద్ధతి ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈమేరకు తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. మేడ్చల్ రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని సహభావన టౌన్ షిప్, పోచారంలోని సద్భావన టౌన్ షిప్, గాజుల రామారంలోని సహిరా టౌన్ షిప్ లలో గల ఖాళీ ఫ్లాట్లను ‘ఉన్నచోట ఉన్నట్లు’గా లాటరీ ప్రాతిపదికన విక్రయించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించారు.

బండ్లగూడ సహభావనా టౌన్ షిప్ లోని ఫ్లాట్ల కొనుగోలుదార్లు ఈనెల 29వ తేదీలోగా, పోచారం సహభావనా టౌన్ షిప్ ఫ్లాట్లను కొనేవారు ఈనెల 31వ తేదీలోగా నిర్ధేశించిన మొత్తం డిపాజిట్ గా చెల్లించాలని కోరారు. అదేవిధంగా పోచారంలోని సద్భావన టౌన్ షిప్, గాజులరామారంలోని సహిరా టౌన్ షిప్ లలోని ఫ్లాట్ల లాటరీలో పాల్గొనేవారు ఈనెల 19వ తేదీలోగా డిపాజిట్ చెల్లించాలని పేర్కొన్నారు. ఆయా టౌన్ షిప్ లలో ఫ్లాట్ల కొనుగోలు లాటరీలో పాల్గొనే వారికి డిపాజిట్ గడవుతేదీ ముగిసిన మరుసటి రోజు లాటరీ ప్రాతిపదికన ఫ్లాట్లు కేటాయించనున్నట్లు రాజీవ్ స్వగృహ అధికారులు ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో పూర్తయిన, అసంపూర్తి ఫ్లాట్లు కూడా ఉండడం గమనార్హం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు నోటిఫికేషన్ లో వివరించారు.

Popular Articles