Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ఎమ్మెల్యే సాబ్ అంటే ఎట్లుండాలె…? ఇగో గిట్లుండాలె…!!

ఎమ్మెల్యే సాబ్ అంటే ఎట్లుండాలె… మానుకోట… అదేనండీ మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లెక్కన ఉండాలె. ఏం జేసిండు ఎమ్మెల్యే సాబ్ అనుకుంటున్నరా ఏంది? హోళీ పండుగ వేళ పార్టీ కార్యకర్తలను మస్త్ ఖుషీ జేసిండు. హోళీ రంగులు జల్లుకున్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నోట్లో మందు (విస్కీ) పోసిండు.

పార్టీ కార్యకర్తలతోని దినాం పనులు జేయించుకునుడేనా? అప్పుడప్పుడు గిట్ల పండుగలు, పబ్బాలు ఒచ్చినపుడు మానుకోట ఎమ్మెల్యే శంకరన్న లెక్కన కార్యకర్తలకు కాసింత ‘మందు’ బోసి అర్సుకోవాలె… అంటున్నరు అధికార పార్టీ కార్యకర్తలు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పార్టీ కార్యకర్తలకు పండుగపూట మందుబోసి ఖుషీ జేసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో శక్కర్లు గొడుతున్నయ్.

అన్నట్టు అసలు సంగతి జెప్పలేదు గదా? ఎమ్మెల్యే సాబ్… అనగా మన శంకరన్నకు మాత్రం ఎటువంటి ‘మందు’ అలవాటు లేదు. తనకు అలవాటు లేకున్నా పార్టీకి చెందిన కొందరు కార్యకర్తల అలవాటును గౌరవించి వారి నోట్లో మందు బోసి శంకర్ నాయక్ సాబ్ మస్త్ దావత్ జేసిండు. అదీ మానుకోటలో హోళీ పండుగ అసలు విశేషం.

Popular Articles