Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

అప్పులపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

తెలంగాణా రాష్ట్ర అప్పులపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను విపక్షం వక్రీకరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి అనని వ్యాఖ్యలను ప్రతిపక్షం ప్రచారం చేస్తోందన్నారు. అప్పు ఉందని చెప్పకపోతే ప్రజలను మోసం చేసినట్లవుతుందన్నారు. మాయ మాటలు చెప్పడం ఇందిరమ్మ ప్రభుత్వం వల్ల కాదన్నారు. కూసుమంచి మండలం కేంద్రంలో మంగళవారం నిర్వహించిన పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 8.19 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. ఆ అప్పులను తీర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందన్నారు. నిజాన్ని మాయ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రి అన్నారు. రాష్ట్రం చల్లగా ఉండాలనుకునే వారు ప్రతిపక్ష విమర్శలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాలను ప్రతిపక్షం రెచ్చగొడుతోందని, ఉద్యోగులు వారిపై ఎదురు దాడి చేయాలని మంత్రి పొంగులేటి కోరారు.

Popular Articles