Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

కొండా సురేఖ ఇంటికి పోలీసులు, వాగ్వాదం

హైదరాబాద్: తెలంగాణా మంత్రి కొండా సురేఖ ఇంటికి బుధవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు వచ్చారు. విధుల నుంచి తొలంగించిన మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ కోసం వరంగల్ జిల్లా పోలీసులు నిన్నటి నుంచి గాలిస్తున్నారు. ఇందులో భాగంగానే సుమంత్ కోసం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో గల మంత్రి కొండా సురేఖ నివాసానికి పోలీసులు చేరుకున్న సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. సుమంత్ కోసం మఫ్టీలో వచ్చిన పోలీసులతో కొండా సురేఖ కూతురు సుస్మిత తీవ్ర వాగ్వాదానికి దిగారు. సుమంత్ అరెస్టుకు కారణాలేంటో, అతనిపై ఫిర్యాదు చేసినవరెవరో చెప్పాంటూ సుస్మిత పోలీసులను ప్రశ్నించారు.

మఫ్టీలో గల పోలీసును ప్రశ్నిస్తున్న మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత

ఈ నేపథ్యంలోనే సుస్మిత పలు ఆరోపణలు చేశారు. తమను పార్టీ నుంచి బహిష్కరించాలని చూస్తున్నారని, సుమంత్ పై అభియోగాల నమోదుతో తమ తండ్రి కొండా మురళిని అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఇదిలా ఉండగా సుమంత్ కోసం వచ్చిన పోలీసులను ఇంట్లోకి అనుమతించే ప్రసక్తే లేదని సుస్మిత వారితో వాదిస్తున్న పరిణామాల్లోనే మంత్రి కొండా సురేఖతోపాటు విధుల నుంచి తొలగింంచిన ఓఎస్డీ సుమంత్ ఇంట్లోనుంచి బయటకు వచ్చి ఒకే కారులో వెళ్లిపోవడం గమనార్హం.

Popular Articles