హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) బెటాలియన్-1 కమాండర్ బర్సే దేవా తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. తన అనుచరులు పలువురితో కలిసి దేవా ఆయుధాలతో లొంగుబాటను ఆశ్రయించినట్లు సమాచారం. తెలంగాణా-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోకి వచ్చిన దేవా టీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేవా టీం లొంగుబాటును తెలంగాణా డీజీీపీ శనివారం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం.

