‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించి ఇండియన్ ఆర్మీ మరో వీడియోను విడుదల చేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ లోని టెర్రరిస్టు స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారతీయ ఆర్మీ దాడులు చేసిన విషయం విదితమే. ఈ అపరేషన్ కు సంబంధించి ఇప్పటికే అనేక వీడియోలను విడుదల చేసిన మన సైన్యం తాజాగా మరో వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
‘ప్లాన్డ్, ట్రెయిన్డ్, ఎగ్జిక్యూటెడ్’ పదాలతో ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ అధికారులు విడుదల చేసిన వీడియోను దిగువన చూడవచ్చు..
