‘సమీక్ష’ వార్తా కథనానికి ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ NTv స్పందించింది. మంత్రి శ్రీధర్ బాబు తండ్రి, ఉమ్మడి రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు హత్యోదంతానికి విరుద్ధంగా NTv తన ‘పాడ్ కాస్ట్ షో’లో వాడిన యూ ట్యూబ్ థంబ్ నెయిల్ తీరును విశ్లేషిస్తూ ‘సమీక్ష’ ఈ ఉదయం వార్తా కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. మంత్రి శ్రీధర్ బాబు తండ్రి ‘ఎన్కౌంటర్’ అయ్యారా!? అనే శీర్షికతో ‘సమీక్ష’ వార్తా కథనాన్ని ప్రచురించింది. మీడియా సర్కిళ్లలోనేగాక, రాజకీయ వర్గాల్లోనూ ‘సమీక్ష’ ప్రచురించిన వార్తా కథనం వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే NTv యూ ట్యూబ్ లోని తన వీడియోకు పెట్టిన థంబ్ నెయిల్ ను కొద్దిసేపటి క్రితం మార్చడం విశేషం. ‘ఎన్కౌంటర్’ అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ‘సంఘటన’ అనే పదాన్ని మార్చిన పాత, కొత్త థంబ్ నెయిళ్లను దిగువన చూడవచ్చు.


ఇదీ ‘సమీక్ష’ ఈ ఉదయం ప్రచురించిన వార్తా కథనం:
