Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

సన్నిహితుని ఆకస్మిక మృతి: ఎంపీ వద్దిరాజు దిగ్భ్రాంతి

తన సన్నిహితుడు బత్తినీడి ఆది విష్ణుమూర్తి ఆకస్మిక మృతి పట్ల రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఉన్నట్టుండి అస్వస్థతకు గురై హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున విష్ణుమూర్తి తుదిశ్వాస విడిచారు. విష్ణుమూర్తి నాలుగు రోజుల కిందట అనారోగ్యానికి గురైనట్లు కేరళ పర్యటనలో ఉన్న ఎంపీ రవిచంద్రకు తెలిసిన వెంటనే ఫోన్ చేసి ఆయన కుమారుడు దీపక్ తో మాట్లాడారు. ఆ తర్వాత ఆస్పత్రిలో విష్ణుమూర్తిని చూసి, డైరెక్టర్ డాక్టర్ ఏన్.బీరప్ప తదితర వైద్య నిపుణులతో ఎంపీ వద్దిరాజు సమావేశమై మరింత మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరారు.

దీపక్ ను ఓదారుస్తున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

అయితే ఆదివారం తెల్లవారుజామున విష్ణుమూర్తి పరమపదించారని తెలుసుకున్న ఎంపీ రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. విష్ణుమూర్తి పార్థివదేహాన్ని నిమ్స్ ఆస్పత్రి మార్చురీలో ఉంచగా, మాసబ్ ట్యాంక్ విజయనగర్ కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లి కుమారుడు దీపక్ ను ఎంపీ వద్దిరాజు తన సమీప బంధువు ఆకుల రాజయ్య, సన్నిహితులు వి. ప్రకాష్, మరికల్ పోత సుధీర్ కుమార్, చెరుకూరి శేషగిరిరావు, ఊసా రఘు, శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి వెళ్లి ఓదార్చారు.

విష్ణుమూర్తి నివాసంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, తదితరులు

విష్ణుమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం ప్రకటించి వారికి మనోధైర్యాన్నిచ్చారు. అదేవిధంగా ఎంపీ రవిచంద్ర తమ్ముడు వద్దిరాజు వెంకటేశ్వర్లు, కుమారులు వద్దిరాజు శ్రీనివాస్, వద్దిరాజు నాగరాజు, వద్దిరాజు నిఖిల్ చంద్రలు విష్ణుమూర్తి కుమారుడు దీపక్ ను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Popular Articles