Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

‘చికెన్ నారాయణ.., నేను మగ్ధూం భవన్ బంట్రోతును కాదు’

సీపీఐ జాతీయ నేత నారాయణపై మంత్రి పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు

‘నన్ను బర్తరఫ్ చేయడానికి, నేను మగ్ధూం భవన్ లో నువ్వు పెట్టిన బంట్రోతును కాదు, కేసీఆర్ కేబినెట్ లో మంత్రిని… బీజేపీ వాళ్లు నాపై చేసిన దాడిని ఈ ‘చికెన్ నారాయణ’గారు సమర్థిస్తుండా?’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానిస్తూ, ప్రశ్నించారు.

నిన్న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సమయంలో కూకట్ పల్లిలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ స్పందిస్తూ, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ నేపథ్యంలోనే మంత్రి అజయ్ సీపీఐ నారాయణ చేసిన డిమాండ్ పై బుధవారం మీడియా సమావేశంలో స్పందించారు. వాస్తవానికి బీజేపీ వాళ్లే తనను చంపడానికి ప్రయత్నించారని కూడా అజయ్ ఆరోపించారు. తనకు కూడా ‘ఐదు నిమిషాల పని’ అని చెబుతూ, కానీ సంయమనంతో ఉన్నట్లు అజయ్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో సీపీఐ నారాయణపైనా మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంతకీ పువ్వాడ అజయ్ గురించి సీపీఐ నారాయణ ఏమన్నారు? అందుకు ప్రతిస్పందనగా మంత్రి పువ్వాడ అజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఏమిటో దిగువన గల వీడియోల్లో చూసేయండి.

https://www.youtube.com/watch?v=ijFk6pBUA50&feature=youtu.be

Popular Articles