Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

చిక్కుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్!

తెలంగాణా రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై పొన్నం ప్రభాకర్ చేసినట్లు పేర్కొంటున్న ‘దున్నపోతు’ వ్యాఖ్య ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. పొన్నం ప్రభాకర్ తనపై చేసిన వ్యాఖ్యకు క్షమాపణ చెప్పాల్సిందేనని, రేపటి వరకు సమయం ఇస్తున్నానని, లేనిప్సంలో జరిగే పరిణామాలకు అతనే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అల్టిమేటమ్ జారీ చేశారు. ఈమేరకు ఆయన కొన్ని న్యూస్ ఛానళ్లతో మాట్లాడారు. తన జాతి మొత్తాన్ని పొన్న ప్రభాకర్ అవమానపర్చాడని, తాను ఈ విషయంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీని, రాహుల్ గాంధీని, మల్లిఖార్జున ఖర్గేను, మీనాక్షి నటరాజన్ లను కలుస్తానని కూడా లక్ష్మన్ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా మంత్రులు పొన్న ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ల మధ్య నెలకొన్న వ్యాఖ్యల దుమారపు వేడిని చల్లార్చేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించినట్లు మరోవైపు వార్తలు వచ్చాయి. మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగి జోక్యం చేసుకున్న తర్వాత ఈ ఇద్దరు మంత్రుల మధ్య వివాదం సమసిపోయిందని వార్తలు వెలువడిన నేపథ్యంలోనే అడ్లూరి లక్ష్మణ్ పొన్న ప్రభాకర్ కు అల్టిమేటమ్ జారీ చేయడం గమనార్హం. అడ్లూరి లక్ష్మణ్ కు మోత్కుపల్లి నరసింహులు తదితర దళిత నేతల మద్ధతు కూడా లభిస్తోంది.

Popular Articles