రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూతన గృహప్రవేశం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని తన సొంత గ్రామమైన నారాయణపురంలో నిర్మించిన కొత్త ఇంట్లోకి గురువారం శాస్త్రోక్తంగా ప్రవేశించారు. తెల్లవారుజామున 4.30 గంటల శుభముహూర్తంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, పూజా కార్యక్రమాలతో మంత్రి నూతన గృహ ప్రవేశం చేశారు. మంత్రి శ్రీనివాస రెడ్డి తన సతీమణి మాధురి, తల్లి స్వరాజ్యం, సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి – శ్రీలక్ష్మి దంపతులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు.

