Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

సైబర్ నేరాల కీలక నిందితుడు వికాస్ చౌదరి లొంగుబాటు!?

ఖమ్మం: సైబర్ నేరాల దోపిడీ కేసులో కీలక నిందితుడైన ఉడతనేని వికాస్ చౌదరి మరికాసేపట్లో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ముందు లొంగిపోనున్నట్లు తెలిసింది. సరిగ్గా రెండు నెలల క్రితం.. గత డిసెంబర్ 24వ తేదీన ఖమ్మం జిల్లా పెనుబల్లి పోలీసులు నమోదు చేసిన సైబర్ నేరాల కేసులో ఉడతనేని వికాస్ చౌదరి అత్యంత కీలక నిందితుడు కావగం గమనార్మం. మొత్తం రూ. 549.95 కోట్ల రూపాయల ఈ దోపిడీ కేసులో పోట్రు ప్రవీణ్, పోట్రు మనోజ్ కళ్యాణ్ అనే వ్యక్తులు సహా మొత్తం 20 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

అయితే ఈ కేసులో కీలక నిందితునిగా పోలీసులు భావిస్తున్న ఉడతనేని వికాస్ చౌదరి మాత్రం గడచిన రెండు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో వికాస్ చౌదరి పోలీసులకు ఇప్పటికీ చిక్కకపోవడం గమనార్హం. గడచిన రెండు నెలలుగా పెనుబల్లి పోలీసులు ఎంతగా గాలిస్తున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇదే దశలో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా వికాస్ చౌదరి యాంటిసిపేటరీ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం.

హైకోర్టులో ముందస్తు బెయిల్ యత్నాలు ఫలించకపోవడంతో అనివార్యంగా వికాస్ చౌదరి లొంగుబాటను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరికొద్ది గంటల్లోనే సైబర్ నేరాల దోపిడీలో కీలక నిందితునిగా వార్తల్లోకి వచ్చిన వికాస్ చౌదరి ఖమ్మం పోలీస్ కమిషన్ సునీల్ దత్ ముందు లొంగిపోనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Popular Articles