Top 5 This Week

Related Posts

మున్సిపల్ ఎన్నికల్లో ‘జాగృతి’., ఇదీ ‘సింహం’ గుర్తు చరిత్ర!?

(సమీక్ష ప్రత్యేక కథనం)
వచ్చే నెలలో జరుగుతాయని భావిస్తున్న తెలంగాణా మున్సిపల్ ఎన్నికల బరిలోకి కల్వకుంట్ల కవిత అనుయాయులు దిగబోతున్నారు. త్వరలోనే రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు కవిత పలు సందర్భాల్లో చెప్పారు. ఏదో ఒకరోజు తాను కూడా సీఎం అవుతాననే ధీమాను ఆమె వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జాగృతి’ సంస్థపై ఇటీవల కవిత కీలక ప్రకటన చేశారు. జాగృతి ఇంకా పూర్తిగా రాజకీయ పార్టీగా మారలేదని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఈనెల 21వ తేదీన కవిత స్పష్టం చేశారు.

అయితే కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఈ అంశంలో కవిత వైఖరి మారినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణా జాగృతి నిర్ణయించింది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నెలల టైం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగృతి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఓవైపు పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగాన్ని పెంచుతూనే, మరోవైపు మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కవిత నిర్వహిస్తున్న జాగృతి సంస్థ సిద్ధమైంది.

అయితే పార్టీ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి కాకుండా ఎన్నికల్లో పోటీ ఎలా? అనే ప్రశ్నకు వస్తే.. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ (ఏఐఎఫ్‌బీ) తరపున కవిత జాగృతి అభ్యర్థులు మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీకి దిగనున్నారు. ఈమేరకు ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో చర్చలు జరిపారట. ఎన్నికల్లో ఉమ్మడి గుర్తుకోసం ఏఐఎఫ్‌బీ పార్టీకి చెందిన సింహం గుర్తుపై కవిత ఎంపిక చేసిన అభ్యర్థులు పోటీ చేస్తారట.

ఇంతకీ ఏఐఎఫ్‌బీ పార్టీ నేపథ్యమేంటి? ఆ పార్టీకి చెందిన ‘సింహం’ గుర్తు కథేమిటి? అనే అంశాలపై ‘సమీక్ష’ ఆరేళ్ల క్రితం.. 2020 జనవరి 30వ తేదీన ఆసక్తికర వార్తా కథనాన్ని ప్రచురించింది. తెలంగాణాలో ఆ పార్టీ తరపున ఓ ఎమ్మెల్యే సహా 82 మంది ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన రికార్డును ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ సొంతం చేసుకుంది. అందుకు సంబంధించిన పూర్తి కథనపు లింక్ దిగువన ఉంది.. చదివేయండి.

Popular Articles