Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

చిక్కుల్లో స్మితా సబర్వాల్

తెలంగాణాలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. కంచ గచ్చబౌలి భూముల విషయంలో పోలీసులు స్మితా సబర్వాల్ కు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల అంశంలో వన్యప్రాణులకు సంబంధించిన ఓ సోషల్ మీడియా పోస్టును రీట్వీట్ చేశారనే అభియోగంపై పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఈనెల 12వ తేదీనే స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుండగా, ఈ విషయం మాత్రం బుధవారం వెలుగులోకి రావడం గమనార్హం.

కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న “హాయ్‌ హైదరాబాద్‌” అనే ఎక్స్ హ్యాండిల్ పోస్టు చేసిన గిబ్లీ ఫొటోను స్మిత రీపోస్ట్‌ చేసినట్లు ప్రధాన ఆరోపణ. ఇందులో హెచ్‌సీయూ మష్రూమ్ రాక్ ఎదుట భారీగా బుల్డోజర్లు ఉన్నట్లుగా దృశ్యం ఉంది. ఈ బుల్డోజర్ల ముందు నెమలి, జింకలు ఉన్నాయి. ఈ పోస్టుని ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో రీపోస్టు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఫేక్ ఫొటోగా తేల్చారు. ఈ మేరకు బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 179 కింద స్మితా సబర్వాల్ కు నోటీసులు జారీ చేశారు. కాగా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై చట్ట ప్రకారం ముందుకు వెడతామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Popular Articles