కవిత ఓపెన్ ప్రెస్ మీట్ తర్వాత మాటాడేవాళ్లు ఎక్కువయ్యారు! వీళ్లకున్న credibility, credentials ఏమిటో? పార్టీతో కేసీఆర్ కుటుంబంతో తమకున్న బంధ, అనుబంధ, సంబంధాలు కూడా చెప్పరు! గొట్టం కనిపించగానే గొంతు చించుకుంటున్నారు.
ఆ మాటల్లో ఎక్కడా sense గానీ, Discretion గానీ కనబడవ్! ఒక్కటంటే ఒక్క సకారాత్మక విమర్శ, నిర్మాణాత్మక సూచన లేవు. నల్లాల తానా, ఇరానీ కేఫులల్ల మాటాడినట్లే!
.
అందరూ కూడబలుక్కున్నట్లుగా చెప్పేదొకటే.
- కేసీఆర్ TRS పెట్టినపుడు నాకు పదే పదే ఫోన్లు చేసేవాడు. ఒకటికి రెండుసార్లు మనుషుల్ని పంపించి రమ్మనేవాడు.
- కవిత, కీటీఆర్ మొదట్నుంచీ లేరు. మధ్యలో దూరి పెత్తనం చేస్తున్నారు.
- బీడీ బిచ్చం – కల్లు ఉద్దెర అన్నట్లుండే KCR కోట్లు గడించేశాడు. ఆ ఫ్యామిలీ ఎక్కడికో వెళ్లిపోయింది.
దాదాపుగా ఇవ్వే… ఎవరి మూతి దగ్గర మైక్ పెట్టినా చెప్పేటివి.
KCR ఎప్పుడూ చాలా స్పష్టంగా ‘తెలంగాణ సాధన కోసం బొంత పురుగునైనా ముద్దాడతా’ అనేవారు. ఆ క్రమంలో అందరి మద్దతుకోసం ఫోన్లు చేసి, పిలిపించుకునేవారేమో!
ఇక, కవిత-కేటిఆర్ మొదట్నుంచీ లేరు. మధ్యలో దూరారు. ఇది మరీ చిల్లర కామెంట్.
.
దేశంలో ఏ పార్టీలోనైనా ఆరంభంలో ఉన్నవాళ్లలో 90% జారిపోతారు. మధ్యలో వచ్చినోళ్లే రింగ్ మాస్టార్లవుతారు.
- కాంగ్రెస్ పార్టీలో… లాల్-బాల్-పాల్ త్రయం స్వాతంత్య్రోద్యమంలో దూకుడుగా పాల్గొని బుర్రలు పగలగొట్టించుకున్న రోజున గాంధీ లేరు. మధ్యలో వచ్చారు.
- NTR తెలుగు దేశం పార్టీ పెట్టినపుడు చంద్రబాబు లేరు. మధ్యలో వచ్చారు.
- YSRCP పెట్టినపుడున్న జ్యోతుల నెహ్రూ, షర్మిల, దాడి, కొణతాల, మైసూరారెడ్డి, అఖిల ప్రియ etc.. నాయకులు దరిమిలా జారిపోయారు.
- ములాయం సింగ్ యాదవ్ సమాజవాది పార్టీ పెట్టినపుడున్న తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్, అమర్ సింగ్ etc..లను సాగనంపేసి… కొడుకు అఖిలేశ్ యాదవ్ గుంజుకున్నారు.
- కవితగానీ మరెవరైనగానీ తప్పులు చేసినా దండిగా గడించినా గిల్టీగా నిర్ధారింఛీ శిక్షించాల్సిన వ్యవస్థలు వేరు. ఛానళ్లలో డిస్కషన్ల ద్వారానో, సోషల్ మీడియాలో కథనాల ద్వారానో తీర్పులు వెలువడవు. అవి అసలు ఏ రకంగానూ, ఏ విధంగానూ వ్యవస్థల్ని ప్రభావితం చేయలేవు.
- (By మణిభూషణ్)


