అసలైన జర్నలిస్టుకు మాత్రమే జర్నలిజపు విలువ తెలుస్తుంది. సహచర జర్నలిస్టు అక్షరానికి గౌరవం ఇవ్వాలనే భావన సిసలైన జర్నలిస్టుకు ఉంటుంది. అది తెలిసిన నిఖార్సయిన జర్నలిస్టు ఎదుటి జర్నలిస్టు ను గౌరవిస్తాడు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే..? ఇల్లెందుకు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గుమ్మడి నర్సయ్యకు సీఎం రేవంత్ ను కలిసే అవకాశం లభించని ఘటన చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
ఈ ఉదంతంపై ‘సమీక్ష’ న్యూస్ తనదైన శైలిలో నిన్న ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని హైదరాబాద్ కేంద్రంగా వెలువడే ‘సాహసమ్’ అనే తెలుగు దినపత్రిక వాడుకుంది. కానీ ‘కంటెంట్’ను ప్రచురించిన ‘సమీక్ష’ న్యూస్ కు క్రెడిట్ ఇస్తూ.. ఫలానా సంస్థ సౌజన్యంతో.. అని ప్రచురించి గౌరవించింది. జర్నలిజపు విలువ తెలిసిన జర్నలిస్టులు మాత్రమే ఇలా వ్యవహరిస్తారు. జర్నలిజపు కనీస తరీఖ (పద్ధతి) తెలియని వారు పక్కోడి కంటెంట్ ను కాపీ పేస్ట్ చేసుకుని వాడుకుంటారు. విషయం బహిర్గతం చేసే సరికి పోస్ట్ సవరించుకుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
