Top 5 This Week

Related Posts

‘కరోనా సైతాన్’ను తరిమేద్దాం: ఎంపీ నామా

అల్లా దయతో కరోనా సైతాన్ ను తరిమేద్దామని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ఆయన ఓ ప్రకటనలో బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో బక్రీద్ పండుగ ఒకటని అన్నారు. ఈ పండుగ త్యాగానికి ప్రతీకగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బక్రీద్ పండుగను సుఖ, సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ నుండి మక్కాకు హజ్ యాత్రికులు వెళ్లే వారని, కానీ కరోనా నేపథ్యంలో హజ్ యాత్ర లేకపోవడం కొంత బాధాకరమన్నారు. అల్లా దయతో కరోనా సైతాన్ ను తరిమేద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బక్రీద్ పండుగ రోజున ముస్లిం సోదరులు కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఎవరి ఇంటి వద్ద వారే ప్రజలంతా సంతోషంతో సుభిక్షంగా వుండాలని ప్రార్థన చేయాలన్నారు.

Popular Articles