Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

పంచాయతీ ఎన్నికలు: 18 కార్డుల్లో ఏది ఉన్నా ఓటు వేయవచ్చు

ఖమ్మం: గ్రామ పంచాయతీ తొలివిడత ఎన్నికలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఈనెల 14న రెండో విడత, 17వ తేదీన తుదివిడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సమయంలో ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఫరవాలేదు. ఇతర 18 కార్డుల్లో ఏ ఒక్క గుర్తింపు కార్డు ఉన్నా, దాన్ని వెంట తీసుకువెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఇవీ ఆ కార్డుల వివరాలు:

1) ఆధార్ కార్డు.
2) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు.
3) ఫోటోతో కూడిన పోస్ట్ ఆఫీస్/ బ్యాంక్ పాస్ బుక్.
4) కార్మిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు.
5) డ్రైవింగ్ లైసెన్స్.
6) పాన్ కార్డ్.
7) ఫోటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధృవీకరణ పత్రాలు.
8) ఇండియన్ పాస్ పోర్ట్.
9) ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్.
10) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే జారీ చేయబడిన ఉద్యోగ గుర్తింపు కార్డు.
11) ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డు.
12) దివ్యాంగుల గుర్తింపు కార్డు.
13) పట్టాదార్ పాస్ పుస్తకం.
14) రేషన్ కార్డు.
15) ఫోటోతో కూడిన ఆయుధ లైసెన్స్ పత్రం.
16) ఫ్రీడం ఫైటర్ ఐడీ కార్డ్.
17) ఆర్జీఐ ద్వారా జారీ చేయబడిన ఎన్.పీ.ఆర్. స్మార్ట్ కార్డు.
18) ఏంపీలకు జారీ చేయబడిన గుర్తింపు కార్డు.

ఆయా కార్డుల్లో ఏ ఒక్కదాన్ని చూపించైనా ఓటు వేయవచ్చని కలెక్టర్ చెప్పారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ పిలుపునిచ్చారు.

Popular Articles