Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

సిరిసిల్ల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సంఘటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేటకు చెందిన రెబ్బల వంశీ అనే యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. తన పరిస్థితికి కారకులంటూ కొందరి పేర్లను ఉటంకించిన వంశీ చివరి మాటల వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.

తనకు అన్యాయం జరిగిందని నిండు ప్రాణాన్ని తీసుకున్న వంశీ మృతదేహం ఆదివారం సాయంత్రంకల్లా రహీంఖాన్ పేటకు చేరింది. దీంతో వేలాదిగా గుమిగూడిన స్థానికులు వంశీ మృతదేహాన్ని ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి ఇంటి ముందు ఉంచి ఆందోళనకు దిగారు. వంశీ కుటుంబానికి న్యాయం చేయాలని, ఇందుకు బాధ్యులైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. రాత్రి 10 గంటల సమయంలోనూ రహీంఖాన్ పేటలో సాగుతున్న ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయగా, పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను దిగువన చూడవచ్చు.

https://youtu.be/Auqw__PDxQY

Popular Articles