ఛత్తీస్ గఢ్ లో ఆదివారం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ జిల్లా చింద్ ఖరక్ గ్రామ సమీపంలోని అడవుల్లో జరిగిన కాల్పుల్లో మరణించిన నక్సలైట్ల నుంచి ఒక్కోటి చొప్పున ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, 12 బోర్ తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్ మృతుల్లో ఏరియా కమిటీ సభ్యుడు సర్వాన్ మడ్కం అలియాస్ విశ్వనాథ్, ఎల్ఓఎస్ కమాండర్ రాజేష్ అలియాస్ రాకేష్ హేమ్లా, కుంజం బసంతి ఉన్నట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. కాంకేర్, గరియాబంద్ జిల్లాల డీఆర్జీ, బీఎస్ఎప్ బలగాలు జాయింట్ ఆపరేషన్ ఫలితంగా ఈ ఎన్కౌంటర్ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రకటించారు.
